RRR కన్నా వారణాసి ఆరు రేట్లు పెద్దది

Varanasi is 6 times bigger than RRRVaranasi is 6 times bigger than RRR

 

ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం పై హాలీవుడ్ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేసే పనిలో బిజీగా వున్నారు. వారణాసి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కుతుంది, మహేష్ నా అంచనాలకు మించి నటించారంటూ క్రేజ్ పెంచేశారు. ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్వూస్ తో రాజమౌళి చాలా బిజీగా వున్నారు.

వారణాసి కోసం ప్రీ ప్రొడక్షన్ కోసమే చాలా కష్టపడ్డాను అని, దాని కోసం చాలా పేపర్ వర్క్ చేసినట్లుగా రాజమౌళి చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్-రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కావడానికి 315 రోజులు పడితే దానికి ఆరు రెట్లు పెద్దదైన వారణాసి చిత్రాన్ని 275 రోజుల్లోనే పూర్తి  చేశామని, కారణం పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటూ చెప్పుకొచ్చారు.

బడ్జెట్ విషయంలోనూ ఆర్.ఆర్.ఆర్ కన్నా వారణాసి కి బడ్జెట్ డబుల్ అయ్యింది అని, ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చాలామంది వీక్షించారు, అలాంటిది వారణాసి ని అందరూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని, అందుకే ఎక్కువ లాంగ్వేజెస్ లో భారీ గా విడుదల చేస్తున్నట్టుగా రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. 

Varanasi: SS Rajamouli Says Mahesh Babu Starrer Is 5-6 Times Bigger Than RRR