డోరతీ ఓటీటీ రివ్యూ

Dorothy OTT ReviewDorothy OTT Review

 

తమిళనాట కార్తీక్ సుబ్బరాజ్ ట్రాన్స్ జెండర్ నేపథ్యంలో తెరకెక్కించిన డోరతీ చిత్రం కోలీవుడ్ లోనే కాదు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. సనంత్, రిషికాంత్‌ల కలయికలో కీర్తి సురేష్ క్యామియో తో డోరతీ ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించాడు. థియేటర్స్ లో గత నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

డోరతీ కథ: 
ఇద్దరి స్నేహితుల ప్రేమ కథ ఈ డోరతీ. చిన్నప్పటి నుంచి సుబ్బు-కార్తీ అనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్, చిన్నప్పుడు పిరికిగా, భయస్తుడిగా ఉన్న కార్తీ ని సుబ్బు మోటివేట్ చేస్తూ ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. సుబ్బు ఫ్యామిలిలో మహిళలు ఉండరు, అదో రౌడీ ఫ్యామిలీ. చిన్నపుడు పవర్ ఫుల్ గా ఉన్న సుబ్బు పెరిగిన తర్వాత సైలెంట్ గా ఉంటె కార్తి చాలా పవర్ ఫుల్ గా మారిపోతాడు. కానీ సుబ్బు తాను అబ్బాయిని కాదు అమ్మాయిని అని కుటుంబ సబ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బు ఫ్యామిలీ అలా అయితే పరువు పోతుంది అని సుబ్బు ని చంపెయ్యమని కార్తీ ని ఒప్పిస్తారు. మరి కార్తీ సుబ్బు ని చంపెస్తాడా? ట్రాన్సజెండర్ గా మారిన సుబ్బు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తాడు? అసలు ఈ కథలోకి కీర్తి సురేష్ ఎలా వచ్చింది అనేది డోరతీ కథ.

డోరతీ స్క్రీన్ ప్లే:
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చాలా సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ డోరతీ ని తెరకెక్కించాడు. సుబ్బుని చంపేశా అని కార్తి చెప్పే సీన్‌తోనే సినిమాని ఓపెన్ చేయడం, ఆ తర్వాత సుబ్బు-కార్తీ స్నేహాన్ని హైలెట్ చెయ్యడం, స్నేహితులుగా వీరు అద్భుతాలు చేస్తారు అనుకున్న సమయానికి సుబ్బు మారిపోవడం, సుబ్బుని చంపేయాలని చూస్తూ కార్తీ మానసిక సంఘర్షణకు గురి కావడం అన్ని.. ఆడియన్సు లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. కీర్తి సురేష్ ఎంట్రీ సింపుల్ గానే ఉన్నా ఆమె పాత్ర త్వరగా ముగించెయ్యడం ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ చెయ్యడంలో కార్తీక్ సుబ్బరాజు చాలావరకు సక్సెస్ అయ్యాడు

డోరతీ  ఎఫర్ట్స్: 
ఈ చిత్రంలో స్నేహితులుగా సుబ్బు పాత్రలో సనంత్, కార్తీ పాత్రలో రిషికాంత్ ఆకట్టుకున్నారు. మెయిన్ గా సుబ్బు పాత్రలో సనంత్ చూపించిన వేరియేషన్స్ సూపర్బ్ గా ఆకట్టుకున్నాయి. అమ్మాయిగా మారే సమయంలో ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. ఇక  కీర్తి సురేష్ పాత్ర చాలా చిన్నది. ఉన్నంతలో కీర్తి సురేష్ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు పరిధిమేర ఆకట్టుకున్నాయి.

టెక్నీకల్ గా.. కార్తిక్ సుబ్బరాజ్ మేకింగ్‌కి ఫిదా అవ్వాల్సిందే, మ్యూజిక్ ఆకట్టుకోకపోయినా.. BGM బావుంది. ఇక డైలాగ్స్, కెమెరా వర్క్, ఆర్ట్, క్యాస్టూమ్స్ అన్ని ఆకట్టుకున్నాయి.

డోరతీ ఎనాలసిస్:
రెగ్యులర్‌గా చూసే మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే డోరతీ కాదు. ఓ ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కిన ఇది మాత్రం కాస్త డిఫ్రెంట్ గా ఆకట్టుకుంటుంది. అందరికీ నచ్చకపోయినా కొందరిని మాత్రం మెప్పించే అవకాశం ఉంది.

Dorothy Movie OTT Review