బిగ్ బాస్ 10: రోహిత్ కి బ్లాక్ బ్యాడ్జ్, త్రిగుణ్ కి జైలు
Bigg Boss 10: Thrigun Sent to Jail
వీకెండ్ ఎపిసోడ్స్ లో హోస్ట్ నాగార్జున ఎన్ని వార్ణింగ్స్ ఇచ్చినా, ఆఖరికి ఎల్లో కార్డ్ ఇచ్చినా, డోర్ ఓపెన్ చేసి పొమ్మన్నా కొంతమంది తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యంగా రోహిత్, త్రిగుణ్ లు తమ తీరు మార్చికోవడం లేదు. ప్రతి విషయంలో గొడవ పడడమే కాదు, వారిలో ఎవరు ఓడిపోయినా వెక్కిరించుకుంటూ పోట్లాట పెట్టుకోవడం, హౌస్ హార్మోని ని చెడగొట్టడంలో వీరు ఫస్ట్ ఉంటున్నారు.
ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రోహిత్ ని త్రిగుణ్ ని పనిష్ చేసారు. ఈ వారం మొత్తం లో త్రిగుణ్ బిహేవియర్, రోహిత్ బిహేవియర్ లపై వీడియోస్ వేసి చూపించి నాగార్జున వారిపై ఫైర్ అయ్యారు. రోహిత్ త్రిగుణ్ ని అన్న మాటలకు నాగార్జున రోహిత్ కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. రెండు వారాల పాటు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత లేకుండా చేసారు. దానితో రోహిత్ ఫ్యాన్స్ చాలా హార్ట్ అవుతున్నారు.
ఇక ఈ వారం త్రిగుణ్ ఆట విషయం ఎలా ఉన్నా ఆయన బిహేవియర్ పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసారు. వీడియోస్ వేసి చూపిస్తూ త్రిగుణ్ ని వరేయ్ నువ్ అసలు గోట్ ఎలా అయ్యావ్ అంటూ తిట్టడంతో త్రిగుణ్ నా గోట్ ని శివ్ కి ఇచ్చేస్తా అన్నాడు, కానీ నాగార్జున నువ్వు అది కష్టపడి సాధించుకున్నావ్, ఎవరు వేసిన భిక్షో కాదు, నీ పనిష్మెంట్ అంటూ ఈ వారం జైలు లో ఉండమని ఆర్డర్ వేశారు.
ఇక ముఖేష్, వర్షిణి, షాలిని ఇలా ఈ వారం తప్పు చేసిన వారందరిని నాగార్జున పేరు పేరునా లేపి మరీ వార్నింగ్ ఇవ్వడం శనివారం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది.
















































