ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam Needs a Strong Push Before Release

ఆదర్శ కుటుంబం: ఇది సరిపోతుందా?

Aadarsha Kutumbam Needs a Strong Push Before ReleaseAadarsha Kutumbam Needs a Strong Push Before Release


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందులోను పంచ్ డైలాగ్స్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. త్రివిక్రమ్ డైరెక్షన్ చేసినవే కాదు, ఆయన డైలాగ్స్ అందించిన చిత్రాలను ఆడియన్స్ ఇప్పటికి ఎంజాయ్ చేస్తారు. కామెడీకి కామెడీ, పంచ్ లకు పంచ్ లు ఆ సినిమాలకు బలం.

అలాంటి త్రివిక్రమ్ రూటు మార్చి ఎన్టీఆర్ తో అరవింద సమెత చేసారు. అది మాస్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా, అందులోను మాటల మాంత్రికుడి డైలాగ్ స్టయిల్ కనిపించింది. కాని ఈసారి వెంకటేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం మాత్రం అసలు ఇది త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమానేనా అనేలా ఉంది.

ఇప్పటివరకు ఈ చిత్రంపై ఎలాంటి హోప్స్ ప్రేక్షకుల్లో కనిపించలేదు. ట్రేడ్ లోను బజ్ లేదు. ఆదర్శ కుటుంబం ట్రైలర్ వస్తుంది ప్రస్తుతం సినిమాపై ఉన్న అనుమానాలు పారద్రోలి, లేని హోప్స్ పెంచుతుంది అనుకున్నారు. కానీ ఆదర్శ కుటుంబం ట్రైలర్ లో కామెడీ కన్నా ఎక్కువగా యాక్షన్ హైలెట్ అయ్యింది.

అదే చాలామందిని అసంతృప్తికి గురి చేసింది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్ లు కావాలి కానీ.. మాకెందుకు ఈ యాక్షన్ అంటూ చాలా మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా విడుదలకు ముందు ఆదర్శ కుటుంబం పై బజ్ పెంచే కంటెంట్ వదలాలి. ప్రస్తుతం ఉన్న హైప్ అయితే ఆదర్శానికి సరిపోదు. 

Aadarsha Kutumbam: The Six-Day Buzz Challenge