ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tarun Bhaskar is reportedly set to play the lead role in PRS01

ప్రదీప్ రంగనాథన్ ప్రొడక్షన్‌లో తరుణ్ భాస్కర్

Tarun Bhaskar is reportedly set to play the lead role in PRS01Tarun Bhaskar is reportedly set to play the lead role in PRS01

న‌టుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే `PR షో` పేరుతో ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో తొలి సినిమాను తెరకెక్కించనున్నట్లు కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. మమితా బైజు నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత  అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం అశ్వత్ మారిముత్తు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టాలెంటెడ్ డైరెక్టర్ .. యాక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనమికా మాహి, శివాజీ సోంటినేని, స్వసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే? దీనిని విశాల్ టి.ఆర్, యశ్ వి, నరేన్ సోడా, చణక్కియన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరితిలతో కూడిన `ది ఆల్ఫా యూనిట్` అనే ఆరుగురు సభ్యుల బృందం డైరెక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కథ అందించగా.. సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. నటుడిగా మంచి క్రేజ్ ఉన్న ప్రదీప్ తొలిసారిగా నిర్మాతగా మారుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Pradeep Ranganathan Turns Producer!