మల్లారెడ్డి కాలేజ్ పై పేరెంట్స్ ఫైర్

Parents fires on Malla Reddy CollegeParents fires on Malla Reddy College

 

హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ పై పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. ఆదర్శ కుటుంబం విడుదల రోజు అంటే అక్టోబర్ 30 న కాలేజ్ కి సెలవు ప్రకటిస్తూ మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తీసుకున్న నిర్ణయంపై నెటిజెన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత రాత్రి వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజ్ లో జరిగింది.

మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్ నడుమ ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. వెంకీ తో కలిసి స్టేజ్ పై స్టెప్స్ వేస్తూ స్తూడెంట్స్ ని ఉర్రుతలూగించడమే కాదు.. స్టూడెంట్స్ కి ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఆదర్శ కుటుంబం రిలీజ్ రోజు కాలేజ్ కి సెలవు ఇస్తున్నా.. అందరూ సినిమా చూడండి అంటూ అటు స్టూడెంట్స్ కి ఇటు ఆదర్శ కుటుంబం యూనిట్ కి ఫెవర్ చేసేలా ఇచ్చిన హామీ పై స్టూడెంట్స్ పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. కాలేజీకి ఫీజులు కట్టి పంపించేది పిల్లలని సినిమాలు చూడమని కాలేజ్ కి సెలవు ఇవ్వడానికా అంటూ పేరెంట్స్ మాత్రమే కాదు.. సినిమా ఈవెంట్స్ పెట్టుకోండి, కానీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చెయ్యొద్దు అంటూ నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Malla Reddy Colleges Declare Holiday For Venkatesh Film Aadarsha Kutumbam