బిగ్ బాస్ 10: ఈవారం డేంజర్ ఎవరంటే..
Bigg Boss Telugu 10 7th Week Voting This Contestant In Danger Zone
బిగ్ బాస్ సీజన్ 10 లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. గోట్ టాస్క్ లో అమన్ టాస్క్ గెలిచి గ్రీన్ లెవల్ కి వెళ్ళాడు, ఇక బిగ్ బాస్ స్వయంగా దేబ్జానీ, నీతూ లకు గ్రీన్ లెవల్ కి వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, అసలు సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, లేదంటే డబుల్ ఎలిమినేషనా అనే విషయంలో ఉత్కంఠ మొదలైంది.
మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటె అది ఈపాటికే జరగాల్సి ఉంది. ఇక ఈవారం 12మంది నామినేషన్స్ లో ఉండగా.. అమన్, దేబ్జానీ, నీతూ లు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు, వారికి రెండు వారాలు ఇమ్యూనిటీ వచ్చేసింది. సో మిగతా వారిలో నరేష్, రామ్ ప్రసాద్, ముఖేష్ లు తప్ప మిగతా హౌస్ మొత్తం నామినేషన్స్ లో ఉంది. అందులో ఈ వారం రోహిత్ గ్రాఫ్ పడిపోయి అతనికి ఓటింగ్ శాతం తగ్గిపోయింది.
రోహిత్ vs త్రిగుణ అన్నట్టుగా ఓటింగ్ లో పోటీపడుతున్నారు. త్రిగుణ కూడా గోట్ అయ్యాడు. సో అతనికి ప్రాబ్లెమ్ లేదు. ఇక ఈవారం షాలిని సీక్రెట్ రూమ్ కి వెళ్ళొచ్చింది, అయితే వైల్డ్ ఫైర్స్ గా హౌస్ లోకి వచ్చిన వారిలో దక్షి హౌస్ లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆమె ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చింది, ఈ వారం దక్షి ఎలిమినేషన్ పక్కా అనిపిస్తుంది.
















































