ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tiger Shroff's choice of water has caught the internet

ఈ హీరో వాట‌ర్ బాటిల్ బిల్లుతో ఇల్లు క‌ట్టొచ్చు!

Tiger Shroff's choice of water has caught the internetTiger Shroff's choice of water has caught the internet

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిట్‌నెస్ వెన‌క ఖ‌రీదైన వ్య‌వ‌హారం దాగి ఉంది. అత‌డి జీవనశైలి కూడా అంతే విలాసవంతంగా ఉంటుంది. తాజాగా త‌న‌ ఇంట్లో తీసిన ఒక వీడియోలో కనిపించిన S.Pellegrino స్పార్కిలింగ్ మినరల్ వాటర్ బాటిల్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. కేవలం 750 ఎం.ఎల్ ఉన్న ఈ ఒక్క వాటర్ బాటిల్ ధర అక్షరాలా రూ. 499గా ఉంది. ఒకవేళ అత‌డు రోజువారీ నీటి వినియోగం లేదా ఇతర అవసరాల కోసం ఈ లగ్జరీ వాటర్‌ను వాడితే, కేవలం తాగునీటి కోసమే నెలకు సుమారు రూ. 90,000 వరకు ఖర్చవుతుందని.. ఏడాదికి ఇది దాదాపు రూ. 27,00,000 చేరుకుంటుందని అంచనా. ఇది ఒక సామాన్యుడి సొంత ఇంటి కోసం మినిమంగా చేసే ఖ‌ర్చు. కేవలం సాధారణ నీటికి బదులుగా ఇలాంటి ఖరీదైన ప్రీమియం బ్రాండ్లను ఎంచుకోవడం ఆయన రిచ్ లైఫ్‌స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

కేవలం టైగర్ ష్రాఫ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వాటర్ బ్రాండ్లనే ఉపయోగిస్తుంటారు. హాలీవుడ్ ప్రముఖులు నికోల్ కిడ్‌మన్, జస్టిన్ టింబర్‌లేక్ `ఫిజి వాటర్`ను ఇష్టపడగా, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ `వాస్ వాటర్` బాటిల్స్ కోసం ఏకంగా ఒక ప్రత్యేక రిఫ్రిజిరేటర్‌ను కేటాయించుకున్నారు. అలాగే భారతీయ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు గిగీ హడిడ్ వంటి ప్ర‌ముఖుడు ఎవియన్ స్ప్రింగ్ వాటర్‌ను తాగుతుంటారు. ఇక పారిస్ హిల్టన్ అత్యంత ఖరీదైన `బ్లింగ్ H2O`వాటర్ బాటిల్స్‌ను వాడుతుండగా, జెన్నిఫర్ అనిస్టన్ `స్మార్ట్‌వాటర్`ను ఎంచుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

హాలీవుడ్ ప్రముఖులు నికోల్ కిడ్‌మన్, జస్టిన్ టింబర్‌లేక్ `ఫిజి వాటర్`ను ఇష్టపడగా, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ `వాస్ వాటర్` బాటిల్స్ కోసం ఏకంగా ఒక ప్రత్యేక రిఫ్రిజిరేటర్‌ను కేటాయించుకున్నారు. అలాగే భారతీయ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు గిగీ హడిడ్ వంటి ప్ర‌ముఖుడు ఎవియన్ స్ప్రింగ్ వాటర్‌ను తాగుతుంటారు. ఇక పారిస్ హిల్టన్ అత్యంత ఖరీదైన `బ్లింగ్ H2O`వాటర్ బాటిల్స్‌ను వాడుతుండగా, జెన్నిఫర్ అనిస్టన్ `స్మార్ట్‌వాటర్`ను ఎంచుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

పైన చెప్పిన బ్రాండ్ల వాట‌ర్ బాటిల్స్ ఖ‌రీదు ఒక లీట‌రు బాటిల్ ఎంత ఉంటుందో వివ‌రాల్లోకి వెళితే..

ఫిజి వాటర్ (Fiji Water): లీటరు బాటిల్ ధర సుమారు రూ. 250 నుంచి రూ. 350 వరకు ఉంటుంది. వాస్ వాటర్ (VOSS) ప్రీమియం గ్లాస్ బాటిల్ ధర లీటరుకు సుమారు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంటుంది (ఇది పరిమాణం - ప్యాకింగ్‌ను బట్టి మారుతుంది). ఎవియన్ స్ప్రింగ్ వాటర్ ఒక లీటరు బాటిల్ ధర సుమారు రూ. 250 వరకు ఉంటుంది. బ్లింగ్ H2O (Bling H2O).. స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో అలంకరించబడిన ఈ అత్యంత ఖరీదైన లగ్జరీ వాటర్ బాటిల్ (సాధారణంగా 750 ఎం.ఎల్) ధర సుమారు $45 నుంచి $60 (భారత కరెన్సీలో దాదాపు రూ. 3,800 నుండి రూ. 5,000 పైమాటే) ఉంటుంది. స్మార్ట్‌వాటర్ (Smartwater): లీటరు బాటిల్ ధర సుమారు రూ. 150 నుంచి రూ. 250 వరకు ఉంటుంది.

Tiger Shroff casually sipping ₹499 bottled water like it's normal