ఆదర్శ కుటుంబం ట్రైలర్: కామెడీ, యాక్షన్ మిక్సింగ్

Aadarsha Kutumbam Trailer TalkAadarsha Kutumbam Trailer Talk

 

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం-హౌస్ నెం. 47. ఈ నెల 30 న విడుదలవుతున్న ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకని హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు.

ఆదర్శ కుటుంబం ట్రైలర్ లోకి వెళితే.. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ట్రైలర్‌లో హైలెట్ గా నిలిచాయి. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ వెంకీ ఎనర్జీ అదిరిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ గా, ఫ్యామిలీని రక్షించుకునే సంరక్షుడిగా వెంకటేష్ ఆకట్టుకున్నారు. దానికి తోడు ఆసక్తికరమైన కథనం, కామెడీ సీన్స్ ట్రైలర్‌ లో ఆకట్టుకున్నాయి.

నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా, శ్రీనిధి శెట్టి వెంకీ వైఫ్ గా ఆకట్టుకోగా.. యాక్షన్ సీన్స్ లో తమన్‌ అందించిన నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఆదర్శకుటుంబం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. 

Aadarsha Kutumbam Trailer Released