ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Malaika Arora celebrates her birthday with the paps

బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ సెలబ్రేషన్!

Malaika Arora celebrates her birthday with the papsMalaika Arora celebrates her birthday with the paps

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మలైకా అరోరా పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ ప్రత్యేక రోజున ఆమెకు ఆమె బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్  స్పెషల్‌గా విషెస్ తెలిపారు. మలైకాను ఎంతో ప్రేమగా `డార్లింగ్ మల్లా` అంటూ కరీనా కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా మలైకా పుట్టినరోజును పురస్కరించుకుని కరీనా కపూర్ తమద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే కొన్ని ఆప్యాయమైన, అరుదైన త్రోబ్యాక్  ఫోటోలను షేర్ చేశారు. బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన గర్ల్ గ్యాంగ్‌లో ప్రధాన సభ్యులుగా ఉన్న ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను.. గతంలో దిగిన జ్ఞాపకాలను ఈ పిక్చర్స్‌లో చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

కరీనా పెట్టిన ఈ క్యూట్ బర్త్‌డే పోస్ట్ చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ మలైకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఇద్దరూ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రగాఢ స్నేహం, ఒకరికొకరు ఇస్తున్న సపోర్ట్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

Malaika Arora celebrated her birthday on October 23