ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Madhuri Dixit revealed that she is a huge fan of the character Lolly

మాధురి దీక్షిత్ ఆకట్టుకున్న `లాలీ` మ్యాజిక్!

Madhuri Dixit revealed that she is a huge fan of the character LollyMadhuri Dixit revealed that she is a huge fan of the character Lolly

బాలీవుడ్ దిగ్గజ నటి మాధురి దీక్షిత్ మరాఠీ టెలివిజన్ లో ఓ  ప్రముఖ కామెడీ షోలోని పాత్రపై తన అభిమానాన్ని బయటపెట్టారు. ప్రముఖ కామెడీ రియాలిటీ షో `మహారాష్ట్రచి హాస్య జాత్ర` లో నమ్రత సంభేరావు పోషించిన లాలీ పాత్రకు తాను వీరాభిమానినని మాధురి దీక్షిత్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ షో ప్రత్యేక సంచికలో పాల్గొన్న మాధురి, లాలీ పాత్ర చేసే అల్లరిని ఆమె మాట్లాడే తీరును ఎంతో ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా లాలీ నటించిన డెంట్రిస్ట్ స్కిట్‌ను గుర్తుచేసుకున్న మాధురి దీక్షిత్ ఆ పాత్ర  డైలాగులను సరదాగా రీక్రియేట్ చేసి అలరించారు. లాలీ పాత్ర  ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, అతిశయోక్తిగా ఉండే హావభావాలు , విచిత్రమైన ఇంగ్లీష్ సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రశంసించారు. మాధురి మాత్రమే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ పాత్రపై ఉన్న ఇష్టంతో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం విశేషం.

ఈ పాపులర్ క్యారెక్టర్ పుట్టుక గురించి నమ్రత సంభేరావు మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ముంబైలోని లాల్‌బాగ్ చావ్‌లో తాను పెరిగిన వాతావరణమే ఇలాంటి విభిన్నమైన పాత్రలను సృష్టించేందుకు తనకు ఎంతో సహాయపడిందన్నారు. చావ్‌లలో గమనించే వ్యక్తుల ప్రవర్తనలు.. వారి బాడీ లాంగ్వేజ్ నుంచే లాలీ పాత్రకు రూపకల్పన చేశానని తానే స్వయంగా హెయిర్‌స్టైల్ ని డిజైన్ చేసుకున్నానని నమ్రత పేర్కొన్నారు.
 

Madhuri Dixit reveals being fan of Hasya Jatra's Namrata Sambherao Lolly character