డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజున పెళ్లి మాట‌!

Prabhas birthday specialPrabhas birthday special

పాన్-ఇండియా సూపర్ స్టార్.. ఇండియన్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందడి ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటింది. ఆయన రాబోయే పాన్-ఇండియా చిత్రాల నుండి వరుస అప్‌డేట్‌లు, పోస్టర్లు విడుదలవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపాయి. అయితే ప్రతి ఏటా ప్రభాస్ బర్త్‌డే వచ్చినప్పుడు ఎంతగా సినిమాల చర్చ జరుగుతుందో? అంతకుమించి ఆయన పెళ్లి ప్రస్తావన కూడా తెరపైకి రావడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ పెళ్లి గురించిన చర్చ మళ్లీ జోరందుకుంది.

పాన్ ఇండియా రేంజ్‌లో బిలియన్ల కొద్దీ బాక్సాఫీస్ కలెక్షన్లు సాధిస్తూ  డిమాండ్ ఉన్న హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ వయసు 47 సంవత్సరాలకు చేరుకుంది. అయినా? మోస్ట్ డిజైరబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ఆయన పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారా అని  తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని  అభిమానులు సోషల్ మీడియాలో డార్లింగ్ త్వరలోనే మంచి వార్త చెప్పాలి అంటూ పోస్టులు పెడుతుండటంతో పెళ్లి రూమర్లు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

గతంలో కూడా ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఓ వైపు వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం కానుందని, మరోవైపు కోయింబత్తూరుకు చెందిన కుటుంబంతో సంబంధం కుదిరిందని ప్రచారాలు సాగాయి. అలాగే పలువురు సహ నటీమణులతో ఆయన పేరును ముడిపెడుతూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ బంధువులు ..ఆయన పీఆర్ టీమ్ వీటిని పలుమార్లు ఖండించినప్పటికీ ప్రతి బర్త్‌డే సందర్భంగా `ఈ ఏడాదైనా పెళ్లి వార్త వింటామా?` అని ఫ్యాన్స్ ఆశగా చర్చించుకోవడం విశేషం.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `ఫౌజీ`, `సలార్ 2`, `కల్కి 2`, `స్పిరిట్` వంటి భారీ పాన్-ఇండియా సినిమాలు వరుస క్యూలో ఉన్నాయి. రాత్రింబవళ్లు షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్న డార్లింగ్ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారోనని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. 

Prabhas birthday