ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Negativity against Rohit

బిగ్ బాస్ 10: రోహిత్ పై పెరిగిపోయిన నెగిటివిటి

Bigg Boss 10: Negativity against Rohit Bigg Boss 10: Negativity against Rohit

 

బిగ్ బాస్ సీజన్ 10 లోకి కామనర్ గా ఎంటర్ అయిన రోహిత్ నాయుడు హౌస్ లో మొదట్లో బాగానే ఉన్నాడు. తర్వాత త్రిగుణ చేసే ప్రొవొకింగ్ కి ట్రిగ్గర్ అవుతూ సహనం కోల్పోయి నోటికొచ్చినట్లుగా మాట్లాడడమే కాదు, మరో కామనర్ షాలిని తో కలిసి రోహిత్ ఆట చెడగొట్టుకోవడం ఆయన అభిమానులకే నచ్చడం లేదు. మరోపక్క రోహిత్ సహనం కోల్పోయి మాట్లాడం బయట అతనిపై నెగివిటి పెరగడానికి కారణమైంది.

రోహిత్ ని సపోర్ట్ చేసే బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా రోహిత్ పై ఆగ్రహం చూపిస్తూ రివ్యూస్ ఇస్తున్నారు. అగ్నిపరీక్షలో రోహిత్ ని చూసి ఫ్యాన్స్ అయినవారు ఇంకా ఇంకా రోహిత్ ని గుడ్డిగా నమ్ముతున్నారు. త్రిగుణ అనేవాడు తప్పు చేయలేదు అని చెప్పడం లేదు, అతను రోహిత్ ని ఏడిపిస్తే సహనం కోల్పోయి నోటికొచ్చినట్టుగా వాగడమే నచ్చడం లేదు.

సోమవారం ఎపిసోడ్ లో రోహిత్ త్రిగుణ ని ముఖేష్ ని అలాగే దక్షి ని రోహిత్ మాట్లాడిన మాటల విషయంలో సోషల్ మీడియాలో రోహిత్ పై బాగా నెగిటివిటి పెరిగిపోయింది. రోహిత్ తన పవర్ ని టాస్క్ లో చూపించాల్సింది పోయి ఇలా సహనం కోల్పోయి మాట్లాడడం అతనికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది.
 
ఇక ప్రస్తుతం షాలిని హౌస్ లో లేకపోయినా రోహిత్ ఆమె భజనే చేసాడు. మళ్లి ఆమె హౌస్ లోకి వచ్చాక షాలిని తో బాండింగ్ కంటిన్యూ చేస్తూ రోహిత్ ఆట కూడా లైట్ తీసుకుంటున్నాడు. రెడ్ జోన్ లో ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నా అతనిలో మార్పు కాలేదు. ఇలా అయితే కప్ కాదు కదా టాప్ 5 లో కనిపించే అవకాశం కూడా ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

Bigg Boss Telugu contestant Rohit has faced online Negativity