ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kaaka Release date becomes a hot topic once again

మరోసారి హాట్ టాపిక్ గా కాక రిలీజ్ డేట్

Kaaka Release date becomes a hot topic once againKaaka Release date becomes a hot topic once again

 

మెగాస్టార్ నటిస్తున్న రెండు బిగ్ ప్రాజెక్ట్స్ విడుదల తేదీ విషయంలో మెగా కన్ఫ్యూజన్ నెలకొంది. విశ్వంభర అలాగే కాక రెండు చిత్రాలు విడుదల తేదీల విషయంలో మెగాస్టార్ చిరు ఓ కంక్లూజన్ కి రాలేకపోయారనే టాక్ ఎప్పటినుంచో నడుస్తుంది. దర్శకుడు బాబీ కొల్లి మాత్రం కాక ని ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్ చెయ్యాలని పట్టుబట్టుకుని షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

మరోపక్క దర్శకుడు వశిష్ట ఇంకా విశ్వంభర నిర్మాతలు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల అయితేనే విశ్వంభర బయటపడుతుంది అని ఆశపడుతున్నారు. నెల రోజుల క్రితం ఈ విశ్వంభర, కాక విడుదల విషయంలో సస్పెన్స్ నడిచినా.. చిరు ఏదో సరిచేసారన్నారు.. కానీ మరోసారి ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది.

కాక సంక్రాంతి రిలీజ్ విషయంలో ఆలోచనలో పడింది, అందుకే దసరా కి స్పెషల్ పోస్టర్ రాలేదు, వసిష్ఠ తెరకెక్కించిన విశ్వంభర ఫైనల్ కాపీ చూసి ఇది సంక్రాంతికి వర్కౌట్ అవుతుంది అని చిరు బలంగా నమ్మితే దర్శకుడు బాబీ తో మాట్లాడి కాక ని మార్చ్ లేదా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేసేలా ఒప్పిస్తారనే టాక్ నడుస్తుంది. 

Kaaka vs VIshwambhara