ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Indian 3 Producer conditions on Director Shankar?

శంక‌ర్ కే నిర్మాత‌లు కండీష‌న్లా?

Indian 3 Producer conditions on Director Shankar?Indian 3 Producer conditions on Director Shankar?

కోలీవుడ్  దర్శకుడు శంకర్ సినిమాలంటేనే భారీతనం, విజువల్ వండర్స్ గుర్తుకొస్తాయి. అయితే ఆయన సినిమాల బడ్జెట్ విషయంలోనూ.. షూటింగ్ రోజుల విషయంలోనూ నిర్మాతలు ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేస్తుంటారు. తాజాగా శంకర్ తెరకెక్కిస్తున్న `ఇండియన్ 3`  విషయంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ పెట్టిన కండిషన్లు ఇప్పుడు సినీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారాయి.

`ఇండియన్ 2` విడుదల తర్వాత ఈ సిరీస్‌లోని మూడో భాగానికి సంబంధించి అదనంగా మరో 25 రోజులు షూటింగ్ జరపాలని దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ముందు  ప్రపోజల్ పెట్టారట. అయితే ఈ ప్రతిపాదనకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మొహమాటంగా'నో చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇకపై కొత్తగా ఎలాంటి అదనపు ఖర్చులు పెట్టడానికి తాము సిద్ధంగా లేమని.. ఇప్పటికే షూట్ చేసిన ఫుటేజ్‌తోనే ఫైనల్ కట్ రెడీ చేయాలని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం.

షూటింగ్ మాత్రమే కాకుండా ఇకపై బడ్జెట్ అంతా కేవలం వీఎఫ్‌ఎక్స్ ..పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీదే దృష్టి పెట్టాలని నిర్మాతలు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఇప్పటికే సినిమాలు నిర్మించిన లైకా సంస్థ, బడ్జెట్ నియంత్రణపై గట్టి పట్టుతో ఉన్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు శంకర్ వంటి బ్రాండ్ ఉన్న డైరెక్టర్‌కు కూడా నిర్మాతలు ఈ రకమైన షరతులు విధించడం కోలీవుడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది.

Reports Surface That Producer Denied Shankar's Request