తేజ సజ్జ ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
Teja Sajja confirms arranged marriage
యువ హీరో, సూపర్ హీరో తేజ సజ్జ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నవంబర్ లో ఎంగేజ్మెంట్, డిసెంబర్లో తేజ సజ్జ పెళ్ళికి ముహుర్తాలు నిశ్చయించారు పెద్దలు. తేజ సజ్జ ది పెద్దలు కుదిర్చిన వివాహం. అమ్మాయి సినిమా రంగానికి చెందిన ఫ్యామిలీ నుంచి రావడం లేదు. తేజ సజ్జ సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు.
ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు నిశ్చయించిన వివాహమే అని తేజ సజ్జ అందరికి చెప్పేసాడు. ఇక నవంబర్ 16 న హైదరాబాద్ లో తేజ సజ్జ ఎంగేజ్మెంట్ జరగనుంది. డిసెంబర్ 19 న తేజ సజ్జ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ తేజ సజ్జ వివాహ వేదికగా పెద్దలు నిశ్చయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు.
తేజ సజ్జ చేసుకోబోయే అమ్మాయి వివరాలు, ఆమె ఏ ఫ్యామిలికి చెందినది అనేది తెలియరాలేదు, ఆమె అమెరికా లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి ప్రస్తుతం ఇండియాలోనే స్థిరపడినట్లుగా తెలుస్తుంది. రాజస్థాన్ లో వివాహం తర్వాత హైదరాబాద్ లో తేజ సజ్జ వెడ్డింగ్ రిసెప్షన్ జరిపిస్తారని టాక్.
















































