418 ప్రీమియర్స్ టాక్
418 Movie Premieres Talk
క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో బిగ్ బ్యానర్ మైత్రి మూవీస్ నుంచి సినిమా వస్తుంది అంటే మాస్ ఆడియన్స్ లోనే కాదు మూవీ లవర్స్ అందరిలో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందులోను హరర్ ఫిలిం అంటే అదో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో హారర్ నేపథ్యంలో తెరకెక్కిన 418 - ది నైట్‌మేర్ బిగిన్స్ సినిమా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
418 ప్రీమియర్స్ ఇంకా ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ చిత్రం పై ఆడియన్స్ తమ స్పందనను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. మరి 418 ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. హారర్ కథకు మంచి సెటప్ ఇచ్చారు, సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్, సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉన్నాయి..
ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీని ఆసక్తికరమైన క్లూస్‌తో కథను దర్శకుడు నడిపించిన తీరు బాగుంది, కథలో బ్యాక్‌స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటూ ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్పీడు సెకండాఫ్‌లో తగ్గింది. బ్యాక్‌స్టోరీ రివీల్ అయిన తర్వాత సినిమా కొంత గ్రిప్ కోల్పోయింది. మాములుగా హారర్ సినిమాల్లో కనిపించే అంశాలు, స్క్రీన్‌ప్లే వల్ల సినిమా తేలిపోయింది అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు.
సెకండ్ హాఫ్ డల్ అయినా క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ సినిమాకి మెయిన్ హైలైట్స్ అంటూ ఇంకొందరు ప్రేక్షకుల మాట. మరి ఓవరాల్ గా 418 - ది నైట్‌మేర్ బిగిన్స్ ఎలా ఉందొ అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..
















































