భర్త కోసం రష్మిక ఆరాటం
Rashmika’s concern for her husband
రష్మిక మందన్న ఆల్రెడీ టాప్ హీరోయిన్. పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్ గా రష్మిక కొనసాగుతుంది. అలాగే బాలీవుడ్ లోను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక మారిపోయింది. ప్రస్తుతం రష్మిక చేతిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటుగా క్రేజీ స్టార్ హీరోల చిత్రాలు ఉన్నాయి. ఇప్పట్లో ఆమె కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు.
కానీ ఆమె పెళ్లి చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ కి ఇమ్మిడియట్ గా సక్సెస్ కావాలి. గత కొన్ని సినిమాలు విజయ్ దేవరకొండ కి సక్సెస్ ఇచ్చినట్టే కనిపిస్తున్నా అవి సంపూర్ణ విజయాన్ని అయితే అందించడమే లేదు. అందుకే రష్మిక తెగ ఆరాటపడిపోతుంది. భర్త విజయ్ దేవరకొండ విజయం కోసం తపన పడిపోతుంది.
రణబాలి లో విజయ్ తో కలిసి నటించిన రష్మిక.. ఆ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించేసరికి భర్త విజయ్ ని వెంటేసుకుని రణబాలి ని ప్రమోట్ చేస్తూ గత ఐదు రోజులుగా మీడియాలోనే కనిపించింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లో అయితే బతుకమ్మ ఉత్సవాలు, తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడడం అన్ని రష్మిక పద్దతిగా ఆచరించింది.
అందరూ రష్మిక గురించి మాట్లాడుకునేలా చేసింది. అది విజయ్ దేవరకొండకు, అలాగే రణబాలి కి చాలా హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి, రణబాలి థియేటర్స్ లో పుంజుకోవడానికి కారణమయ్యింది. భర్త కూడా సక్సెస్ ట్రాక్ లో ఉంటె ఏ భార్య అయినాప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
















































