ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam Arrival On October 30 Pushes Itlu Arjuna And Emo Emo Idi

ఆదర్శ కుటుంబం అంతా డిస్టర్బ్ చేసింది

Aadarsha Kutumbam Arrival On October 30 Pushes Itlu Arjuna And Emo Emo IdiAadarsha Kutumbam Arrival On October 30 Pushes Itlu Arjuna And Emo Emo Idi

 

అక్టోబర్ 2 ఆతర్వాత అక్టోబర్ 9 రిలీజ్ అంటూ హడావిడి చేసిన ఆదర్శ కుటుంబం వలన చిన్న సినిమా లు ఎంతగా ఇబ్బంది పడుతున్నాయో అనేది ఈరోజు సమ్మర్ హాలిడేస్ ప్రెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. అక్టోబర్ 9 ఆదర్శ కుటుంబం రిలీజ్ అన్నప్పుడు ఆ వారం విడుదల అనుకున్న చిన్న సినిమాలను అక్టోబర్ 30 కి వాయిదా వేసుకున్నారు.

అందులో చిన్న సినిమాలైన ఇట్లు అర్జున అలాగే సమ్మర్ హాలిడేస్, ఏమో ఏమో చిత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మరోసారి ఆదర్శ కుటుంబం చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. ఇట్లు అర్జున కొత్త రిలీజ్ డేట్ విషయంలో స్వయంగా కింగ్ నాగార్జునే ఈ తేదీ తప్ప మరోక ఆప్షన్ ఇట్లు అర్జున్ కు లేదు అన్నారు.

కానీ ఆదర్శ కుటుంబం మళ్లీ ఇట్లు అర్జున ని డిస్టర్బ్ చేసింది. అక్టోబర్ 30 న ఆదర్శ కుటుంబం డేట్ రాగానే అర్జున మేకర్స్ సైలెంట్ అయ్యారు. ఇక సమ్మర్ హాలిడేస్ కూడా అక్టోబర్ 30 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ నవంబర్ 6 కి షిఫ్ట్ చేసారు. ఇక ఇట్లు అర్జున్ కొత్త తేదీ కూడా నవంబర్ 6 నే కావడం గమనార్హం. 
 

Itlu Arjuna Release Date Changed to November 6