ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Shalini cries, fearing she will be eliminated

BB10: ఎలిమినేట్ అవుతానని ఏడుస్తున్న షాలిని

Bigg Boss 10: Shalini cries, fearing she will be eliminatedBigg Boss 10: Shalini cries, fearing she will be eliminated


బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గొట్ అవతార్ లో భాగంగా రెడ్, ఎల్లో, గ్రీన్ అంటూ టాస్క్ ల యుద్ధం జరుగుతుంది. రెడ్ లో ఉన్న వారంతా ఎల్లో బాక్స్ కి వెళ్లేందుకు టాస్క్ ఆడారు. అందులో రామ్ ప్రసాద్ విన్ అయ్యి ఎల్లో బాక్స్ కి వెళ్ళాడు. ఈపోరులో ఎంతగా ఆడినా.. గెలిచిన వాళ్ళ చేతిలో ఆట నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఢీలా పడిపోయారు. రాంప్రసాద్ ఒకేసారి రోహిత్, రామకృష్ణ లను గేమ్ నుంచి తీసేసాడు.

తర్వాత సుధీర్ షాలిని ని తీసేసాడు. అసలే గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన షాలిని ఎలాగో సీక్రెట్ రూమ్ అంటూ హౌస్ లోకి వచ్చింది. కానీ ఈ టాస్క్ ఓడిపోవడంతో రెడ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఎప్పడైనా ఎలిమినేట్ కావొచ్చు, అలాగే ఆడియన్స్ ఓటింగ్ తోనూ వాళ్లకు డేంజర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఎల్లో బాక్స్ లో ఉన్నవారు ఆడియన్స్ ఓటింగ్ తోనే ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.

అయితే ఆ టాస్క్ నుంచి సుధీర్ షాలిని ని తప్పిస్తూ నువ్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ కూడా కాలేవు అందుకే తీసేసా అన్నాడు. దానితో షాలిని దుబాయ్ సోఫాలో కూర్చుని ఏడుస్తుంది. కెప్టెన్సీ ఇంపార్టెంటా, లేదంటే ఎలిమినేషనా అంటూ, నేను నామినేషన్స్ లో ఉన్నా, నాకు ఈ వారం చాలా ఇంపార్టెంట్ అంటూ ఏడవడంతో రోహిత్ ఆమెను ఓదారుస్తూ..

ఏమవుతుంది ఎలిమినేట్ అయితే ఇంటికెళ్ళిపోతాం, తర్వాత ఇంకా చాలా ఉంది అంటాడు, తర్వాత త్రిగుణ వచ్చి ఓదారుస్తాడు, అయినా షాలిని కి మాత్రం ఎలిమినేషన్ భయం అయితే పట్టుకుంది. 

Bigg Boss Telugu 10: Yesterday episode highlights