దసరా కూడా వదులుకున్నారు
Vishwambhara and Swayambhu Skip Dasara Update
టాలీవుడ్ లో రెండు సినిమాల విడుదల పరిస్థితి ఇప్పుడు పెద్ద పజిల్ లా మారింది. ఆ సినిమాల విడుదల తేదీల కోసం ప్రేక్షక దేవుళ్ళు ఎదురు చూసి చూసి ఆల్మోస్ట్ ఆ చిత్రాలను మర్చిపోయారు. అయినప్పటికీ మేకర్స్ లో చలనం లేదు. ఇదిగో విడుదల తేదీ వస్తుంది, అదిగో ఆ పండక్కి రిలీజ్ డేట్ లాక్ చేస్తారని చూసి చూసి విసిగిపోయారు.
అవే మెగాస్టార్ చిరు విశ్వంభర. మరొకటి నిఖిల్ స్వయంభు. ఈ రెండు చిత్రాలకు సీజీ వర్క్ కీలకం, దానివల్లే చాలా కాలంగా ఈ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. విశ్వంభర వీఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తయ్యింది, కానీ విడుదల తేదీ ఓ కొలిక్కి రావడమే లేదు. దసరా పండగకి విశ్వంభర విడుదల తేదీ తెలుస్తారనుకుంటే దసరా ని మేకర్స్ లైట్ తీసుకున్నారు.
ఇక నిఖిల్ స్వయంభు ఎప్పుడు విడుదలవుతుందో అటు హీరోకి కూడా ఐడియా లేదు అంటే ఆ సినిమా పరిస్థితి దాని విడుదల పరిస్థితి ఏమిటో అర్ధముంటుంది. ఓటీటీ డీల్ వల్లే స్వయంభు విడుదలకు మోక్షం కలగడం లేదు అన్నారు. దసరా కి వస్తుందేమో అంటే విడుదల తేదీ కూడా ఇవ్వకుండానే దసరా వచ్చింది వెళ్లిపోయింది.
మరి విశ్వంభర, స్వయంభు ఈ రెండు సినిమాలకు మోక్షం ఎప్పుడు దొరికేనా అనేది మాత్రం క్లారిటీ లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.
















































