రణబాలి కి అసలు టెస్ట్ మొదలయ్యింది

The real test for Ranabaali has begunThe real test for Ranabaali has begun

 

గత శుక్రవారం విడుదలైన విజయ్ దేవరకొండ రణబాలి చిత్రానికి మొదటిరోజు ఆడియన్స్ నుంచి, ఇంకా క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. అయినప్పటికి విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి రణబాలి పై నెగిటివిటీని పోగొట్టేందుకు ప్రమోషనల్ టూర్, ఇంకా దసరా ఫెస్టివల్ అంటూ చాలా కష్టపడ్డారు.

దానితో రణబాలి కలెక్షన్స్ పెరిగాయి. దసరా హాలిడేస్ కూడా రణబాలి లో అడ్వాంటేజ్ గా మారాయి. ఇక వీకెండ్ ముగిసి సోమవారం మొదలు కాగానే సినిమా కలెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. కారణం మండే వర్కింగ్ డే కాబట్టి. కానీ రణబాలి కి సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజులు దసరా సెలవలు కలిసొచ్చాయి.

దానితో చాలాచోట్ల రణబాలి బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. కాకపోతే ఈరోజు గురువారం స్కూల్స్ అలాగే ఆఫీస్ లు రీ ఓపెన్ అవుతున్నాయి. అంటే ఈరోజు నుంచి రణబాలి కి అసలు టెస్ట్ మొదలు కాబోతుంది. మరి ఈరోజు థియేటర్ అక్యుపెన్సీని బట్టి రణబాలి గురువారం పెరఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. 

Vijay Deverakonda's Ranabaali is reportedly heading