గ్యాంగ్ స్టర్ టార్గెట్ చిన్న హీరో కాదు పెద్ద హీరో
The gangster's target is not a small-time hero, but a major starబాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి విచారణలో అత్యంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో కలకలం రేపిన ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు విచారించగా, వారి అసలు లక్ష్యం టైగర్ ష్రాఫ్ కాదని.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హతమార్చడమేనని తేలింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశాల మేరకు ముంబైకి చేరుకున్న షూటర్లు మొదట సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే సల్మాన్ ఖాన్ నివాసం ఆయన చుట్టూ ఉన్న భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండటంతో ఆ ప్రణాళికను అమలు చేయడం సాధ్యం కాలేదని నిందితులు అంగీకరించారు. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్ ద్వారా టైగర్ ష్రాఫ్‌కు ప్రత్యేక పోలీసు భద్రత లేదనే విషయాన్ని గమనించిన నిందితులు.. బాలీవుడ్‌లో తీవ్ర భయాందోళనలు సృష్టించే ఉద్దేశంతో చివరి నిమిషంలో తమ టార్గెట్‌ను టైగర్ ష్రాఫ్‌కు మార్చినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
















































