బ్లాక్ డ్రెస్ లో తమన్నా మాయాజాలం!
Tamannaah Looks Stunning in a Black Dress
మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం సౌత్ ని వదిలేసింది. కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీ తమన్నా ని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఓదెల 2 తర్వాత తమన్నా దర్శనం సౌత్ లో కనిపించలేదు. అందుకే తమన్నా కి కడుపుమంట. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు తగ్గడంతో సౌత్ ఇండస్ట్రీపై విమర్శల దాడి చేస్తుంది.
సౌత్ లో గ్లామర్ షోస్ అలాగే గ్లామర్ రోల్స్ తోనే హైలెట్ అయిన తమన్నా ప్రస్తుతం హిందీకి వెళ్ళాక టూ మచ్ గ్లామర్ షో చేస్తుంది. అలాంటి తమన్నా సౌత్ ఇండస్ట్రీని విమర్శించడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇక తమన్నా సోషల్ మీడియా లుక్స్ హిందీకి వెళ్ళాక ప్రత్యేకంగా మారాయి, అందాలు ఆరబొయ్యడంలో తమన్నా అస్సలు తగ్గడం లేదు.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో తమన్నా అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. లూజ్ హెయిర్, బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో తమన్నా అదరగొట్టేసింది. ఇక ప్రస్తుతం తమన్నా ముంబై లో జ్యువెలరీ బిజినెస్లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.
















































