రామాయణ సెట్ లో ప్రమాదం

Fire in the Ramayana sets Fire in the Ramayana sets


రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత గా, రావణ్ గా యశ్ నటిస్తున్న రామాయణ పార్ట్ 1 భారీగా తెరకెక్కుతూ ఈ దివాళి కి విడుదల రాబోతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ వైడ్ గా మొదలు పెట్టిన రామాయణ మేకర్స్ కి ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది.  

ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో రామాయణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈరోజు సోమవారం 4:02 గంటలకు ఫిల్మ్ సిటీలోని రిలయన్స్ మీడియా వర్క్స్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, తలుపులు, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, ప్లాస్టిక్ సామగ్రి, బాంబులు, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంలో రామాయణ సెట్ పక్కనే ఉన్న మరిన్ని సినిమా సెట్స్ కూడా ఈ అగ్నిప్రమాదంలో దెబ్బతిన్నాయి. అయితే ముంబై అగ్నిమాపక సిబ్బంది అలెర్ట్ అయ్యి అదుపులోకి తీసుకొచ్చారు అని తెలుస్తుంది.

Mishap in Ramayana days