కాంప్రమైజ్ కానంటున్న దాదా
Dada Is In No Compromise Mode!
నందమూరి బాలకృష్ణ మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని దాదా సెట్ లోకి వచ్చేసారు. మైసూర్ లో కొత్త షెడ్యూల్ తో దాదా షూటింగ్ మొదలు పెట్టారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే బాలయ్య కాస్త ఆలస్యంగా షూటింగ్ లోకి అడుగుపెట్టడంతో డిసెంబర్ 24 నుంచి దాదా ని పోస్ట్ పోన్ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
కానీ బాలయ్య మాత్రం డిసెంబర్ 24 నుంచి కాంప్రమైజ్ అవ్వనంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లో దాదా ను డిసెంబర్ 24 నే విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. అందుకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చెయ్యమని బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని కి చెప్పారని తెలుస్తుంది.
డిసెంబర్ 24 బరి నుంచి తప్పుకుంటే సంక్రాంతి రిలీజ్ బాగానే ఉంటుంది కానీ నిర్మాతలను అంత హాట్ బరిలో ఉంచి ఇబ్బంది పెట్టడమెందుకు అని బాలయ్య డిసెంబర్ 24 నే ఎట్టి పరిస్థితుల్లో దాదా రావాలనే పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య తో మంచు హీరో తలపడబోతున్న విషయం తెలిసిందే.
















































