ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rishab Shetty Teams Up with Chidambaram for Two Films

రెండు కొత్త ప్రాజెక్టుల‌తో కాంతార హీరో సంచ‌ల‌నం!

Rishab Shetty Teams Up with Chidambaram for Two Films Rishab Shetty Teams Up with Chidambaram for Two Films

కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. సంచలన విజయం సాధించిన మంజుమ్మల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరంతో కలసి రెండు చిత్రాలు చేయబోతున్నారు. ఈ బిగ్ కాంబినేషన్ కు సంబంధించిన వార్త సినీ వర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇద్ద‌రి కాంబినేషన్‌లో రాబోతున్న తొలి చిత్రం కన్నడలో తెరకెక్కే  స్పోర్ట్స్ డ్రామా అని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ ఎపిక్ జై హనుమాన్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  జై హనుమాన్ చిత్రీకరణ పూర్తయిన వెంటనే రిషబ్ శెట్టి, చిదంబరం కాంబో స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నారు.

చిదంబరం జాన్ ఎ మాన్, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలతో మలయాళ పరిశ్రమలోనేకాక‌ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ  విభిన్నమైన స్పోర్ట్స్ కథాంశంతో రావ‌డం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్‌ను  నిర్మాత షిబు థమీన్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సమాచారాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రియలిస్టిక్ డ్రామాలను తెరకెక్కించడంలో ప్రతిభ చూపిన చిదంబరం, విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే రిషబ్ శెట్టి కలిసి రెండు చిత్రాలు ఒకేసారి చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ కాంబినేషన్ నుంచి రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా కోసం కన్నడ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rishab Shetty