ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss10: Apoorva vs Trigun and Mukhesh

BB 10: కెప్టెన్ డామినేషన్ vs హౌస్ మేట్స్ ఈగో

Bigg Boss10: Apoorva vs Trigun and MukheshBigg Boss10: Apoorva vs Trigun and Mukhesh


ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చాలామందికి అర్ధం కావడం లేదు. సోమవారం టాస్క్ లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేసారు. మధ్యలో కెప్టెన్ అపూర్వ రూల్స్ ఫాలో అవ్వాలంటుంది, ఆమె అవ్వదు. ఆ విషయంలో త్రిగుణ, ముఖేష్ గౌడ్ ప్రతిసారి అపూర్వని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇక నామినేషన్స్ లోను త్రిగున్ ని రోహిత్, అమన్, అపూర్వ ఇలా చాలామంది టార్గెట్ చేసారు. ఇక సోమవారం టాస్క్ లో త్రిగున్ రోహిత్ ని తిడుతూ ఉమ్మి వెయ్యడంపై ఆడియన్స్ లో త్రిగున్ పై నెగిటివిటి మొదలయ్యింది. రోహిత్ పై కూడా ఆడియన్స్ లో నెగెటివ్ మొదలైంది. త్రిగున్ ని బయట అయితే కొడతా అంటూ రోహిత్ మాట్లాడడం అన్ని అతనిపై ఆడియన్స్ లో పాజిటివ్ నెస్ తగ్గిస్తుంది.

ఇక కెప్టెన్ రూమ్ లో షాలిని, సుధీర్ కూర్చోవడం పై ముఖేష్ గౌడ్ అపూర్వ ని ప్రశ్నించడంతో ముఖేష్ తనకు కెప్టెన్సీ రావడంపై రగిలిపోతున్నాడు, అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడు అంటూ అపూర్వ మిగతా వారితో చెబుతుంది. ఏది ఏమైనా ఈవారం కెప్టెన్ డామినేషన్ vs హౌస్ మేట్స్ ఈగో అన్నట్టుగా హౌస్ కనిపించింది. 

Bigg Boss10