ఇచ్చిన మాట నిలబెట్టుకో డ్రాగన్

Dragon on track with the release dateDragon on track with the release date

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం షూటింగ్ ఎన్టీఆర్ భుజానికి తగిలిన గాయంతో బ్రేక్ పడింది. త్వరలోనే ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లోకి వెళతాను అని చెబుతున్నారు. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి ఫ్యాన్స్ కి ఎనేర్జి ఇచ్చారు.

అయితే తన భుజం నొప్పి ఇంకా తగ్గలేదు అని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారు. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్రాగన్ డ్రాగన్, సీఎం సీఎం అని అరుస్తుంటే వారిని సైలెంట్ అవ్వమని డ్రాగన్ అనుకున్న తేదీకే వస్తుంది నో టెన్షన్ అంటూ ఎన్టీఆర్ చెప్పడం చూసి చాలామంది ఎన్టీఆర్ ప్లీజ్ మాట మీద నిలబడు, మాట నిలబెట్టుకో డ్రాగన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కారణం చాలా సినిమాలు ఊరించి ఊరించి విడుదల వాయిదా వెయ్యడం అనేది పరిపాటిగా మారడంతో ఆయా హీరోల అభిమానులకు పిచ్చెక్కిపోతుంది. దానితో ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని ఆయన అభిమానులు రిక్వెస్ట్ పెడుతున్నారు. 

Massive update on Dragon