ది పారడైజ్ లో కొరియన్ స్టైల్ యాక్షన్!
Nani’s The Paradise brings Korean-style action to the big screen
నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం `ది పారడైజ్`. దసరా వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇద్దరి కలయికలో వస్తోన్న్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. ఇప్పటివరకు 250కి పైగా సినిమాలకు పనిచేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఈ చిత్రానికి ఫైట్ కొరియోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే తమ సుదీర్ఘ అనుభవాన్ని పక్కనపెట్టి ఈ సినిమా కోసం చిన్న పిల్లల్లా మళ్లీ మొదటి నుంచి కొత్తగా నేర్చుకుని పనిచేయాల్సి వచ్చిందని అన్నదమ్ములు వెల్లడించారు.
ఈ చిత్రం గురించి రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ `ది పారడైజ్` కథాంశం, నేపథ్యం, పాత్రల రూపకల్పన, అలాగే భావోద్వేగాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. శ్రీకాంత్ ఓదెల విజన్ కు తగ్గట్టుగా చిత్రంలో ని స్టంట్స్ లో కొరియన్ యాక్షన్ సినిమా శైలిని జోడించినట్లు వెల్లడించారు. కొరియన్ యాక్షన్ విధానాల ప్రభావంతో సినిమాలో రెండు ప్రధాన ఫైట్ సీక్వెన్స్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేశామనిజ.. ఇవి ప్రేక్షకులకు వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రం తరతరాలుగా ప్రాథమిక హక్కులకు దూరమైన ఓ గిరిజన తెగ కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. ఆ తెగకు చెందిన ప్రజల కోసం ఓ కొత్త నాయకుడు చేసే పోరాటమే `ది పారడైజ్` కథ. ఈ సినిమాలో కయాదు లోహార్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న భారీ యాక్షన్ డ్రామా త్వరలో విడుదలవుతుంది.
















































