ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> SRK says more than one word about Mahesh Babu

బాద్‌షా మనసు గెలుచుకున్న సూపర్ స్టార్

SRK says more than one word about Mahesh BabuSRK says more than one word about Mahesh Babu


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్- సూపర్ స్టార్ మహేష్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమం ఎక్స్ లో షారుఖ్ ఖాన్ నిర్వహించిన #AskSRK సెషన్‌లో మహేష్ బాబు ప్రస్తావన వచ్చింది. ఓ అభిమాని మహేష్  గురించి ఒక్క మాటలో చెప్పమని షారుఖ్‌ను కోరగా ఆయన స్పందిస్తూ  సూపర్ స్టార్‌పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.

ఈ ప్రశ్నపై స్పందించిన షారుఖ్ ఖాన్, మహేష్ ను  ఒక్క మాటకే పరిమితం చేయకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. `మేము ఎప్పుడు కలిసినా ఆయన ఎంతో మర్యాదగా, మైత్రితో స్పందిస్తారు. ఆయన ఎంతో స్వీట్ అండ్ కైండ్. దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి` అని షారుఖ్ ఆత్మీయంగా బదులిచ్చారు.  ఇద్ద‌రి మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం ..అనుబంధం అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఇద్ద‌రు   రాబోయే భారీ చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' చిత్రంలో నటిస్తుండగా, మహేష్ దర్శకధీరుడు  రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `వారణాసి` చిత్రంలో రుద్ర పాత్రలో అలరించబోతున్నారు.
 

SRK says more than one word about Mahesh Babu, fans demand a superstar collaboration