సూపర్ స్టార్ బిజినెస్ స్ట్రాటజీ

Superstar RajinikanthSuperstar Rajinikanth

 

సూపర్ స్టార్ రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. ఒక సినిమా విడుదల కాకుండా మరో సినిమాపైకి వెళ్ళిపోతారు. జైలర్ 2 విడుదల కాలేదు, అప్పుడే ధర్మన్ మూవీ సెట్ పైకి వెళ్లిపోయారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 అక్టోబర్ 15 న విడుదల కాబోతుంది.

భీబత్సమైన క్రేజ్ ఉన్న ఈ సీక్వెల్ పాన్ ఇండియా ఆడియన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. జైలర్ 2 ని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికే విడుదల చెయ్యడానికి యూనిట్ మొత్తం శ్రమిస్తోంది. జైలర్ 2 చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది, కానీ ఆ విషయంలో రజినీకాంత్ సీరియస్ అయ్యారనే టాక్ నడుస్తుంది.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్2 కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. కూలి చిత్రం కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నారట  జైలర్ 2 కి దాని కంటే రూ.25 కోట్ల రూపాయలు తగ్గించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

జైలర్ 2కి రూ.125 కోట్ల రూపాయలతో పాటు లాభాల్లో వాటాను రజనీ పారితోషికంగా తీసుకోనున్నారట. ఇది చూసి రజినీకాంత్ బిజినెస్ స్ట్రాటజీ అదుర్స్ అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

Rajinikanth - Jailer 2