నానికి విలన్‌గా అందుకే డాన్స్ ఐకాన్!
The Paradise - Raghav Juyalనాని- శ్రీకాంత్ ఓదెల, కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `ది ప్యారడైజ్` పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో జోష్ మరింత రెట్టింపు అయింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రచారం పనులు వేగంగా జరుగుతున్నాయి.
కాగా ఈ చిత్రంలో విలన్ (ప్రతినాయకుడి) పాత్ర కోసం ప్రముఖ నటుడు, డాన్సర్ రాఘవ్ జుయల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యకేంగా అతడినే ఎందుకు తీసుకున్నట్లు తాజాగా శ్రీకాంత్ ఓదెల రవీల్ చేసారు. ఈ పాత్రకు సరైన నటుడిని వెతకడం కోసం శ్రీకాంత్ ఓదెల...ఆయన బృందం ఏకంగా ఎనిమిది నెలల పాటు అన్వేషణ సాగించారు.
అనేక మంది నటులను పరిశీలించినప్పటికీ శ్రీకాంత్ అనుకున్న ప్రత్యేకమైన నెగెటివ్ ఎనర్జీకి ఎవరూ సరిపోలేదు. చివరికి రాఘవ్ జుయల్ నటించిన `కిల్` సినిమాలోని పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత శ్రీకాంత్ ఆయననే విలన్‌గా ఖరారు చేశారు. రాఘవ్ సహజమైన బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ చూసి పాత్రను ప్రత్యేకంగా ఆయన శైలికి తగ్గట్టుగా తిరిగి రాసినట్లు తెలిపారు.
ఈ సినిమాలో రాఘవ్ జుయల్‌ను కేవలం సాధారణ విలన్‌గానే కాకుండా ఎంతో లోతైన మేనరిజమ్స్ ఉన్న క్రూరమైన పాత్రలో చూపించబోతున్నారు. నాని- రాఘవ్ జుయల్ మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ..పవర్ఫుల్ యాక్షన్‌ను అందిస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
















































