మామ కోసం మాజీ అల్లుడు త్యాగం
Dhanush om release postponed
కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజీ సీక్వెల్ జైలర్ 2 అక్టోబర్ 15 న విడుదలకాబోతుంది. దసరా హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 కి మంచి డేట్ లాక్ చేసారు. రిలీజ్ డేట్ లాక్ చేసాక జైలర్ 2 రీ షూట్స్, అలాగే సినిమా విడుదల వాయిదా అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, వాటిని మేకర్స్ ఖండించడం చూసాం.
అయితే రజినీకాంత్ జైలర్ అక్టోబర్ 15 న వస్తుంటే ఆయన మాజీ అల్లుడు స్టార్ హీరో ధనుష్ కూడా అక్టోబర్ 16 న తన ఓం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. ధనుష్-సాయి పల్లవి, శ్రీలీల కలయికలో తెరకెక్కుతున్న ఓం కూడా అక్టోబర్ 16 న విడుదల అంటూ చెప్పడంతో మామ-మాజీ అల్లుడు మధ్యన ఆసక్తికర పోటీ అనుకున్నారు.
కానీ ఇప్పుడు ధనుష్ అక్టోబర్ 16 దసరా బరి నుంచి తప్పుకుంటున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. నవంబర్ 20 న ఓం ని రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే మామకు మాజీ అల్లుడు దారిస్తూ త్యాగం చేస్తున్నారన్నమాట. ఓం వాయిదా నిజమేనేమో.. అందుకే ధనుష్ ఓం ప్రమోషన్స్ స్టార్ట్ కూడా చెయ్యడం లేదు అనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
















































