వారణాసి లీకుల గోల
Leaked image of Varanasi set stuns fans
దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ కలయికలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ ఓ కొలిక్కి వచ్చేసింది. మహేష్ బాబు ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే వారణాసి షూటింగ్ ఫినిష్ అవుతుంది, అక్టోబర్ నుంచి వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్ళిపోతుంది అని సమాచారం.
అయితే రాజమౌళి ముందు నుంచి అవసరానికి మించి వారణాసి అప్ డేట్స్ ఇస్తున్నా వారణాసి షూటింగ్ సెట్ నుంచి లీకులు ఆగడం లేదు. ఇప్పటికే వారణాసి నుంచి పలు సీన్స్ అనేకసార్లు లీక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారణాసి లీకులు సోషల్ మీడియా ని కమ్మేశాయి.
ఆ లీకైన ఇమేజ్ లో ఒక భారీ దేవాలయం బ్యాక్‌డ్రాప్‌తో నిర్మించిన సెట్‌లో అత్యంత భారీ డైనోసార్ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. మరి వారణాసి చిత్రంలో ఆలయ ప్రాంగణంలో డైనోసార్ ఉండటం అనే ఈ ఊహించని అసాధారణ కలయిక చూసి, రాజమౌళి అసలు ఎలాంటి సరికొత్త కథాంశాన్ని ప్లాన్ చేస్తున్నారనే ఆసక్తి సినీ ప్రియుల్లో మరింత పెరిగింది.
ఇక వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకినీ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ గా నెగెటివ్ పాత్రలో కనిపింహనున్నారు.
















































