అన్న పాస్ - తమ్ముడు ఫెయిల్
Kollywood Suriya
కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య-కార్తీలు కొన్నాళ్లుగా విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. వరస సినిమాలు చేస్తున్నారు కానీ.. అవి వారికి ఊరటనివ్వడం లేదు సరికదా నిరాశలోకి నెట్టేస్తున్నాయి. కరోనా తర్వాత హీరో సూర్య చేసిన సినిమాలన్నీ సోసో గానో లేదంటే ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి, కానీ ఈ ఏడాది ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. కరుప్పు తో రూ.200 కోట్లు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.250 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన సూర్య ఈ ఏడాదే హ్యాట్రిక్ గా సీన్ సినిమా తో దివాళి కి ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు సిద్డమాయ్యారు. అన్న సూర్య విజయాలను అందుకుంటూ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
కానీ తమ్ముడు కార్తీ మాత్రం ఆ సక్సెస్ కోసం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. వరస సినిమాలు చేస్తున్న కార్తీ కి కాలం కలిసి రావడం లేదు. సర్దార్ 2 పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే ఇప్పుడు సర్దార్ 2 కూడా కార్తీ ని డిజప్పాయింట్ చేసింది. తెలుగు, తమిళ్ ఇలా సర్దార్ 2 విడుదలైన ప్రతి భాషలోనూ ఆ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చేసింది.
సినీ విమర్శకుల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు సర్దార్ 2 ని ఏకి పడేస్తున్నారు. కార్తీ యాక్టింగ్ తప్ప సర్దార్ 2 లో చెప్పుకోవడానికి ఏమి లేదు అని తేల్చేసారు. మరి సూర్య మాదిరి కార్తీ ఎప్పుడు పాస్ అవుతాడో, ఎప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో చూడాలి.
















































