ప్రభాస్ ఫౌజీ మేకర్స్ అలర్ట్ అవ్వాలి
Prabhas' Fauji Postponed Indefinitely, Eyes 2027 Release
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 న విడుదల అంటూ మేకర్స్ అనౌన్స్ చెయ్యడమే కాదు.. ప్రీమియర్స్ అంటూ ఊరించారు కూడా.
కానీ ఇప్పుడు ఫౌజీ డిసెంబర్ 3 కి రాకపోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫౌజీ షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం సరిపోని కారణంగా ఫౌజీ విడుదల డిసెంబర్ 3 నుంచి వాయిదా వేసి, 2027 లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోపక్క ఫౌజీ అనుకున్న తేదికి రాకపోతే ఓటీటీ డీల్ లో కోత పెడతామని ఫౌజీ ఓటీటీ పార్ట్నర్ బెదిరింపులు.
ఇవన్ని ప్రభాస్ అభినులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలు ఆగాలంటే మేకర్స్ త్వరగా అలర్ట్ అవ్వాల్సిందే. ది ప్యారడైజ్ విడుదల వాయిదా వార్తలను సాయంత్రానికే మేకర్స్ పోస్టర్ తో క్లారిటీ ఇస్తూ ఖండించారు. అలానే ఫౌజీ మేకర్స్ కూడా విడుదల వాయిదా వార్తలను ఖండించాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.







































