ఎన్టీఆర్ డ్రాగన్ పై నిర్మాత క్రేజీ అప్ డేట్
Producer's exciting update on NTR's Dragon
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భుజానికి సర్జరీ చేయించుకుని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీ డ్రాగన్ షూటింగ్ లో గాయపడి ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని రెస్ట్ లో ఉండడంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దానితో డ్రాగన్ మూవీ అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమనే న్యూస్ మొదలయ్యింది.
కానీ డ్రాగన్ నిర్మాత, మైత్రి నిర్మాత రవి శంకర్ మాత్రం డ్రాగన్ షూటింగ్ మరో రెండు వారాల్లో మొదలు కాబోతుంది. ప్రశాంత్ నీల్ దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. అనుకున్న సమయానికే అంటే వచ్చే ఏడాది జూన్ లోనే డ్రాగన్ మూవీ విడుదలవుతుంది అని ఇరుముడి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నిర్మాత చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.
ఎన్టీఆర్ గాయం వలన డ్రాగన్ షూటింగ్ లేట్ అవుతుంది అని భయపడిన ఫ్యాన్స్ నిర్మాత భరోసా ఇవ్వడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు.







































