ఆసుపత్రి పాలైన మమిత బైజు
Mamitha Baiju has been hospitalisedరూ.200 కోట్ల క్లబ్బులోకి బ్యాక్ టు బ్యాక్ మూడుసార్లు చేరి హ్యాట్రిక్ కొట్టిన మలయాళ బ్యూటీ మమిత బైజు ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే సడన్ గా మమిత బైజు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం కలకలం సృష్టించింది. ఆమె తీవ్రమైన జ్వరంతో, బాడీ పైన్స్ తో బాధపడుతూ ఆసుపత్రి పాలైంది.
వరస విజయాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మమితా బైజు ఈ సక్సెస్ ని ఆస్వాదిస్తోంది అనుకుంటే ఆమె హాస్పిటల్ పాలవడం అభిమానులను కలిచి వేసింది. మమితా బైజు జ్వరం బారిన పడడంతో ఆమె ఆస్ట్రేలియా లో చెయ్యాల్సిన ఓ ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసుకుంది.
సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో జరగనున్న క్లైడ్ ఓనం 2026 కి తను అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నాను అని, డాక్టర్స్ సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పింది మామితా బైజు. దానితో ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
















































