ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kavya Kalyanram, Kaala Bhairava in relation

పెళ్ళికి సిద్దమైన టాలీవుడ్ ప్రేమ జంట

Kavya Kalyanram, Kaala Bhairava in relationKavya Kalyanram, Kaala Bhairava in relation


టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ ప్రేమించుకుని పెద్దలనొప్పించి పెళ్లివరకు వెళ్లిన జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పడు ఆ కోవలోకి మరో టాలీవుడ్ లవర్స్ జంట వస్తున్నారు. కొద్దిరోజులుగా బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తో మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ ని ఈ జంట నిజం చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలోకి కావ్య కళ్యాణ్ రామ్ ఎంటర్ కాబోతుంది.

ఆ విషయాన్ని ఎమోషనల్ గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కాల భైరవ. లైఫ్ లాంగ్ కావ్య కళ్యాణ్ రామ్ తో జర్నీ చెయ్యబోతున్నట్టుగా రివీల్ చేసారు. కావ్యా తో కలిపి గడిపిన అద్భుతమైన ఫొటోస్ ని షేర్ చేస్తూ.. కావ్య తో కలిసి ఉన్న ప్రతి క్షణం తనకు ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుందని..

పచ్చని కొండల మధ్య జలపాతం అందాలను ఆస్వాదించినంత హాయిగా ఉంటుందని, ఆమెతో కలిసి చేసే చిన్న చిన్న పనులు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందమైన ప్రయాణంలా అనిపిస్తాయని, అంతేకాకుండా కావ్యతో మాట్లాడటం తనకు శీతాకాలంలో ఉదయం ఇష్టమైన వేడి కాఫీ తాగినంత సాంత్వనను ఇస్తుందని చెప్పారు.

తమ జర్నీ ముందుకు కొనసాగుతున్న కొద్దీ ఆ భావన ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన కాలభైరవ.. ఆ భావనకు ఇల్లు అనే పేరే సరైనదని తెలుసుకున్నానని చెప్పారు. కావ్యతో తన తోలి పరిచయం కొత్త వ్యక్తిని కలిసినట్లు తనకు అనిపించలేదని, చాలా కాలంగా వెతుకుతున్న తన ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి కలిగిందని తెలిపారు.

నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నేను కొత్త వ్యక్తిని కలవలేదు. ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి ఆ ఇంటిని వదిలి వెళ్లలేదు అంటూ కాల భైరవ కావ్య కళ్యాణ్ తో డేటింగ్ విషయాన్ని రివీల్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

Kavya Kalyanram and Kaala Bhairava relation confirmed