ఈసారి కూడా బ్రేక్ తీసుకుంటే...
Hero Yash
కేజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చాలా ఎక్కువ సమయం తీసుకుని తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏరి కోరి లేడీ డైరెక్టర్ ని ఎంచుకుని అనౌన్స్ చేసాడు. చాలా ఏళ్ళు ఆ ప్రోజెక్టు పైనే ఉన్నాడు. కేజిఎఫ్ 2 తర్వాత యశ్ నాలుగేళ్లకు ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
టాక్సిక్ అంటూ హాలీవుడ్ స్టయిల్లో సినిమా తీశామని పాన్ ఇండియా ఆడియన్స్ మీదకి వదిలారు. కానీ టాక్సిక్ ని ప్రతి భాష ప్రేక్షకులు రిజక్ట్ చేసారు. మితిమీరిన హింస, రొమాన్స్ ఎక్కువైపోయాయి అంటూ టాక్సిక్ చూసి తిట్టిన వారే కానీ తిట్టని వారు లేరు. ఇలాంటి సినిమా కోసమా హీరో యశ్ నాలుగేళ్లు వేస్ట్ చేసుకుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈసారి వెంటనే యశ్ మరో కొత్త క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యకుండా బ్రేక్ తీసుకుంటే కష్టం అంటూ ఆయన అభినుమాలే అంటున్నారు. యశ్ పాన్ ఇండియా స్థాయి నుంచి టాక్సిక్ తో పాతాళానికి పడిపోయాడు అంటూ అభిమానులు చాలా కంగారు పడిపోతున్నారు. మరి యష్ టాక్సిక్ బ్యాడ్ మూడ్ నుంచి బయటికొచ్చి కొత్త ప్రాజెక్ట్ పైకి వెళ్ళాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







































