టాలీవుడ్ స్టార్లు ఓనం టార్గెట్ చేయట్లేదు!
Tollywood Stars
టాలీవుడ్‌లో పాన్-ఇండియా రేంజ్‌ను దాటి ఆదరణ సొంతం చేసుకున్న కథానాయకులలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ముందు వరుసలో ఉంటారు. మిగతా తెలుగు హీరోలతో పోలిస్తే మాలీవుడ్ (కేరళ) బాక్సాఫీస్ వద్ద ఈ నలుగురికి(నానితో కలిపి) ఉన్న క్రేజ్, మార్కెట్ స్టామినా ప్రత్యేకమైనది. మలయాళ ప్రేక్షకులు వీరి సినిమాలను తమ సొంత చిత్రాల్లా అందిస్తుంటారు.
కేరళీయులకు అత్యంత ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఓనం సీజన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టే సమయం. ఈ పండుగ విరామాన్ని దక్కించుకోవడానికి స్థానిక మలయాళ స్టార్లందరూ పోటీపడుతుంటారు. అయితే మాలీవుడ్‌లో అంతటి బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న నలుగురు తెలుగు స్టార్లు మాత్రం తమ చిత్రాలను నేరుగా ఓనం పండుగ బరిలో విడుదల చేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
సాధారణంగా తెలుగు చిత్రసీమ సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్ల పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలయ్యే హీరోల చిత్రాలు ఉత్తరాదిన... టాలీవుడ్‌లో అనుకూలమైన తేదీల్లో రూపుదిద్దుకుంటున్నాయే తప్ప కేరళలోని ప్రత్యేక ఓనం సీజన్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ కావడం లేదు. ఒకవేళ ఆ సమయంలో తమ సినిమాలు థియేటర్లలోకి వస్తే కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో పాటు సరికొత్త మార్కెట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
ఆ హీరోలకు ఉన్న అపారమైన మాలీవుడ్ పాపులారిటీని మరింత కమర్షియల్‌గా మలచుకోవాలంటే? నలుగురు స్టార్లు ఇకనైనా ఓనం సీజన్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసి రిలీజ్ క్యాలెండర్లను ప్లాన్ చేసుకోవడం అవసరం. పాన్-ఇండియా విడుదల అని సరిపెట్టుకోకుండా కేరళ పండుగ సీజన్లలో స్ట్రెయిట్ మలయాళ చిత్రాలకు సమానంగా థియేట్రికల్ ప్లానింగ్ చేస్తే మార్కెట్ పరిధి నెక్స్ట్ లెవెల్‌కు రీచ్ అవుతుందనడంలో సందేహం లేదు.







































