టాక్సిక్: ఈరోజుతో ఆట కట్టు
Toxic Movie
విడుదలైన రోజు ఫస్ట్ షో కే టాక్సిక్ పనైపోయింది. కాకపోతే కొన్ని థియేటర్స్ లో కాస్త ఈ వీకెండ్ వరకు కొద్దో గొప్పో టికెట్లు బుక్ అయ్యి ఉండడంతో టాక్సిక్ థియేటర్స్ లో జనాలు కనిపించారు. కానీ ఈరోజు తో టాక్సిక్ ఆట కట్టు. అంటే టాక్సిక్ థియేటర్స్ లో ప్రేక్షకులు కనబడితే ఒట్టు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ థియేటర్స్ చాలావరకు ఇరుముడి కి కేటాయించారు.
మొదటిరోజు నుంచే థియేటర్స్ లో ఎదురీదుతున్న ఈ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఇకపై ఎలాంటి ప్రభావం చూపలేదు. టాక్సిక్ థియేటర్స్ ని క్లోజ్ చేసుకోవాల్సిందే. యశ్ ని చూద్దామనో, లేదంటే మరేదన్నా అనో థియేటర్స్ కి వెళ్లే సాహసం కూడా ప్రేక్షకులు చెయ్యరు. అంత దారుణంగా సోషల్ మీడియా రివ్యూస్, టాక్ ఉన్నాయి.
ఇక పై ఏ విధంగానూ థియేటర్స్ లో టాక్సిక్ ప్రభావం కనిపించదు. ఈరోజుతో ఈ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ కనీసం వార్తల్లో కూడా కనిపించే పరిస్థితి లేదు. యశ్ కెరీర్ లో టాక్సిక్ చాలా డిజప్పాయింటెడ్ మూవీ గా మిగిలిపోతుంది.







































