ఇరుముడి: క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలోకే
Irumudi: Ravi Teja's career has seen one of its biggest commercial successes
ఇరుముడి తో చాలా రోజుల తర్వాత రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దర్శకుడు శివ నిర్వాణ మేకింగ్, ఆయన డైలాగ్స్, రవితేజ యాక్టింగ్ ముఖ్యంగా బేబీ నక్షత్ర పెరఫార్మన్స్ ఇరుముడి చిత్రానికి హిట్ దక్కడంలో మేజర్ హైలెట్స్ గా నిలిచాయి. అయితే ఇరుముడి సక్సెస్ క్రెడిట్ మొత్తం రవితేజ ఖాతాలోనే పడింది.
దర్శకుడు శివ కి కానీ.. అందులో నటించిన హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కి పెద్దగా పేరు రాలేదు అని చెప్పాలి. ముందుగా ఇరుముడి సక్సెస్ లో రవితేజ ను గొప్పగా పొగిడారు, ఆతర్వాత ఆయన కూతురు పాత్ర చేసిన నక్షత్రను పొగిడారు కానీ.. హీరోయిన్ పేరు అయితే ఎక్కడా వినిపించలేదు. ఇరుముడి హిట్ మొత్తం రవితేజ చుట్టూనే తిరిగింది.
చాలా ఏళ్లకు రవితేజ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు, అలాగే ఇరుముడి ప్రమోషన్స్ లోను బాగా కనిపించారు. ప్రియా భవాని శంకర్ అలాగే రవితేజ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణా కు అంత గుర్తింపు రాలేదు అనేది చాలామంది అభిప్రాయం. మరి రూ.150 నుంచి రూ.200 వైపు పరుగులు పెడుతున్న ఇరుముడి దర్హకుడు శివ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.







































