ఆదర్శ కుటుంబం న్యూ డేట్ అదేనా?
AK 47 Postponed New Date Announcement Soon
విక్టరీ వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం డోర్ నెంబర్ 47 చిత్రం అక్టోబర్ 2 రిలీజ్ అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసి వీడియోస్ వదిలారు. కానీ తాజాగా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 న విడుదలయ్యే ఛాన్స్ లేదు, ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం పోస్ట్ పోన్ అయ్యి మరీ నెలో, రెండు నెలలకో వెళ్లిపోకుండా ఒక్క వారం లేట్ గా అంటే అక్టోబర్ 9 కి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అక్టోబర్ 9 న ఆదర్శ కుటుంబాన్ని దించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 11 నుంచి దసరా మొదలు కాబోతుంది, 12 నుంచి స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించారు.
ఇక ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చెయ్యబోతుంది. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్, వెంకీ కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.







































