ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja Irumudi OTT Release On Netflix

ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్

Ravi Teja Irumudi OTT Release On NetflixRavi Teja Irumudi OTT Release On Netflix


ప్రస్తుతం థియేటర్స్ లో మాస్ కొట్టుడు కొడుతున్న ఇరుముడి రూ.150 కోట్ల తో మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ కు ఫ్యామిలీ హిట్ రూపంలో ఇరుముడి ఖాతాలో చేరింది. ఇరుముడి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మాస్ కథలతో కన్నా ఇలాంటి కుటుంబ కథలతోనే రవితేజ కెరీర్ లో అద్భుతమైన హిట్ పడింది.

థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇరుముడి విడుదలై పది రోజులవుతుంది. థియేటర్స్ లో ఇంకా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై అందరిలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తుంది. ఈమధ్యన రూ.100 కోట్లు రాగానే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి సినిమాలు.

మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వస్తున్న సమయంలో ఇరుముడి ఓటీటీ విడుదలపై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ మొదలైంది. ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇరుముడి ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Irumudi OTT Streaming Details