ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mamdani opposes NYC event with leader of India's Hindu nationalist group

ఇండియా పై US మేయ‌ర్ విషం!

Mamdani opposes NYC event with leader of India's Hindu nationalist groupMamdani opposes NYC event with leader of India's Hindu nationalist group

 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో కులమతాలు, రంగు, భాష‌- ప్రాంతీయ విశ్వాసాల ప్రాతిపదికన వ్య‌వ‌స్థ న‌డుస్తోందా? అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దాని(భార‌తీయ ఎన్నారై).. RSS చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. ``అమెరికాలో రంగు, మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయి`` అని న్యూయార్క్ (యుఎస్) మేయ‌ర్ మ‌మ్దానీ వ్యాఖ్యానించారు. అత‌డి ఉద్ధేశం భార‌త‌దేశం మ‌త‌విశ్వాసాల‌పై ఆధార‌ప‌డి ఉంద‌ని.. అయితే అత‌డికి తెలియ‌నిది .. ఇక్క‌డ భిన్న‌త్వంలో ఏక‌త్వం.. ప‌రాయి మ‌తాల్ని ఆద‌రించ‌డం అనే గొప్ప స‌మాజం కూడా ఉంద‌ని...!

రాజ్యాంగపరంగా .. న్యాయస్థానాల తీర్పుల ప్రకారం భారతదేశం ఒక లౌకిక రాజ్యమని.. మత విశ్వాసాలు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే పరిమితమని స్పష్టంగా చ‌ట్టం పేర్కొంది. ఎన్నో మైలురాయి తీర్పులలో అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) రాజ్యాంగంలోని అధికరణ 14, 15, 21 ల ప్రకారం జాతి, కుల, మత, లింగ, వర్ణ వివక్షలను చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. అయితే ప్రాథమిక హక్కుల పరిరక్షణకు.. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చే సంక్షేమ ఫలాల అందజేతకు చట్టబద్ధమైన ప్రాతిపదికగా మాత్రమే కులానికి గుర్తింపు ఉండాల‌ని.. దానిని విభజన రాజకీయాలకు వాడుకోవడం సమ్మతం కాదని కోర్టులు స్పష్టం చేశాయి.

ఆధునిక సమాజంలో ప్రగతిశీల మార్పులు రావాలంటే మూఢ విశ్వాసాలు, కులమతాల జాడ్యాల నుండి ప్రజలు బయటపడక తప్పదని భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ చ‌ట్ట‌మే చేసింది. ఇంత‌టి ఆద‌ర్శాల‌తో భార‌త‌దేశం ప‌ర‌మ‌త‌స‌హ‌నాన్ని భ‌రిస్తుంటే అమెరికాలో నివ‌శించే భార‌తీయ వ్య‌క్తి అయిన మేయ‌ర్ ఇలా వ్యాఖ్యానించ‌డం పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఆస‌క్తిక‌రంగా అత‌డు ఒక ముస్లిమ్ కావ‌డం వ‌ల్ల‌నే ఇలా వ్యాఖ్యానించార‌న్న చ‌ర్చా సోష‌ల్ మీడియాల్లో వేడెక్కిస్తోంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటనలో త‌లెత్తిన తాజా ప‌రిణామంతో ఇలాంటి చాలా విష‌యాల‌పై భార‌త‌దేశంలోని యువ‌త‌కు అవ‌గాహ‌న పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

 

NYC: Mamdani opposes rally with Hindu nationalist leader