దర్శకుడు పవన్ సాధినేని అరెస్ట్

 Director Pavan Sadineni Arrested Director Pavan Sadineni Arrested


యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని ఓ వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని పేరు ఈమధ్యన లెనిన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ విషయంలో వినిపించింది.

అయితే ఓ నటి పవన్ సాధినేని తనను మోసం చేసాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు పవన్ సాధినేని ని అదుపులోకి తీసుకుని విచారించడం హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనని మోసం చేశాడంటూ నటి ఆరోపించడంతో పోలీసులు పవన్ సాధినేని ని  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

టాలెంటెడ్ డైరెక్టర్ పై నటి ఫిర్యాదు చెయ్యడం, వెంటనే పోలీసులు రంగంలో దిగి పవన్ సాధినేని ని అరెస్ట్ చెయ్యడం టాలీవుడ్ లో కలకలం సృష్టించింది.

Tollywood Young Director Pavan Sadineni Arrested