డెంగ్యూ బారిన పడిన నటి!
Poonam Dhillon admitted to Mumbai's Lilavati Hospitalబాలీవుడ్ సీనియర్ నటి, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ బారిన పడినట్లు నిర్దారించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలోని వైద్యుల బృందం సంరక్షణలో పూనమ్ కు చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగానే ఉందని.. మెల్లగా కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త బయటకు రావడంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.
నటిగా ఎన్నో హిట్ సినిమాల్లో అలరించిన పూనమ్ ధిల్లాన్ మరోవైపు CINTAA అధ్యక్షురాలిగా సినీ కార్మికులు, నటీనటుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా ముంబైలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.







































