స్పిరిట్: ప్రభాస్ బాడీ డబుల్స్ పై క్లారిటీ
No body double or dupe for Prabhas in Spirit
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత హెవీ వెయిట్ తోనూ, అలాగే మోకాలి సమస్యతోను బాధపడుతూ.. ఇబ్బడి పడుతున్నారు. బాహుబలి తర్వాత ఆయనకొచ్చిన క్రేజ్ చూసి ప్రభాస్ క్రేజ్ చాలు, ఆయన సినిమా ఒప్పుకుంటే.. ఆయనను పక్కనపెట్టుకుని బాడీ డబుల్ తో దర్శకులు పని కానిచ్చేస్తున్నారనే టాక్ మాములుగా జరగడం లేదు. అందులోను రాజసాబ్ ప్రమోషన్స్ లోను మారుతి ఇంటర్వూస్ లో ప్రభాస్ బాడీ డబుల్ పై ఇండైరెక్ట్ గా చాలానే కామెంట్లు చేసాడు.
దానితో ప్రభాస్ సినిమా ఒప్పుకుంటే చాలు, ఆయన నటించకపోయినా బాడీ డబుల్ తో పని కానిచ్చేస్తున్నారనే వార్త వైరల్ అవడము, అదే సమయంలో స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ ని ఫుల్ డేట్స్ అడిగారు, ప్రభాస్ డూప్ లేకుండా నటించాలనే కండిషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి పెట్టారనే న్యూస్ నడిచింది.
తాజాగా ప్రభాస్ స్పిరిట్ నిర్మాతలు స్పిరిట్ లో ప్రభాస్ బాడీ డబుల్స్ వాడడం లేదు, ఒరిజినల్ ప్రభాస్ తోనే సినిమా తీస్తున్నట్టుగా కన్ ఫర్మ్ చేసారు. ప్రభాస్ కోసం డూప్ ని వినియోగించడం లేదు, ప్రభాస్ చాలా కష్టపడి స్పిరిట్ ఫైట్స్, అలాగే మిగతా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టుగా స్పిరిట్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు.







































